Thursday, December 16, 2021

మనో భావాలు

సాంఖ్య యోగః 3

క్లైభ్యం మా స్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే |
క్షుద్రం హ్రదయదౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప ||
.
ఇది శ్రీ కృష్ణుడు అన్ని లక్షల మంది ముందు యుద్ధరంగంలో అంత గొప్ప వాడైన అర్జునుడిని అన్నమాట.
.
ఓ అర్జునా ! నపుంసకుడి వలే పిరికితనమునకు లోనుకావద్దు, నీకిది ఉచితము కాదు, ఈ హృదయ దౌర్బల్యమును వీడి, యుద్ధముచేయుము, అని(ఆ రోజుల్లో నపుంసకులు యుద్ధాల్లో పాల్గొనడం తక్కువ. ఇది గీత లోది నన్ను తిట్టకండి 🙏).
.
అయితే ఇక్కడ అర్జునుడు ఇంత మంది ముందు నన్ను నపుంసకత్వము వదులు అని అంటావా అని మనో భావాలు పాడుచేసేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే, భగవద్గీత సాంఖ్య యోగంతోనే ఆగిపోయేది, మిగతా 15 యోగం లు గాల్లో కలిసిపోయేవి. హృదయ దౌర్బల్యం వదలాలి అన్న విషయం మాత్రం అర్థం చేసుకున్నాడు కబట్టే అర్జునుడి గురించి ఇవాళ కూడా చదువుకుంటున్నాము.
.
అసలు చెప్పిన దానిలో విషయం వదిలేసి, ఎదో ఒక చిన్న విషయం పట్టుకుని దాన్ని చాంతాండంత లాగి, మనో భావాలు దెబ్బతిన్నాయని అవేశ పడిపోయావారెక్కువయ్యారు లోకంలో.


మరీ పిడకల గోడ లాగ అన్నిటిని అంటించేసుకుని, మనోభావాలు దెబ్బతినెయ్యకూడదు, అస్తమాను ఊరుకోపెట్టడం కష్టం 😀

No comments:

Post a Comment