Friday, August 16, 2013

ఏ రోజైతే..

ఏ రోజైతే
నేరస్తులకు నిష్పక్షపాతంగా శిక్షలు పడతాయో
విధించిన శిక్షలు ఖచ్చితంగా అమలవుతాయో,

నేర చరితులకు రాజకీయాలలోకి ప్రవేశముండదో
కారాగారాలనుంచి మంత్రాంగణం చెయ్యడం కుదరదో,


ఏ రోజైతే
వర్గ, కుల, మత, భాషా, ప్రాంత విభేదాలకు తావుండదో
భారతీయేతర భావాలకు విలువుండదో

మన ప్రతీ ఆలోచనలో "మనం" మిళితమై ఉంటుందో
మనపై మనకు ఆత్మ విశ్వాసం మిక్కిలిగా ఉంటుందో

.
.
.

(సశేషం)
.
.
.
ఏ రోజైతే
విధేయత, గౌరవ మర్యాద, ధర్మాచరణలకు
ధనం కన్నా ఎక్కువ విలువ కలుగుతుందో,

జండావందనం కేవలం ఒక సంకేతం కాకుండా
మన భావం, మన నడవడిక అవుతుందో,

ఆ రోజు మాత్రమే మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధిస్తుంది !




No comments:

Post a Comment