Sunday, February 27, 2022

ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలు

 అలం"కారాలు"

-----------------
నడ్డి మీద వడ్డాణం నెత్తి మీద పెట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అలంకారాలంటే అంతే మరి, ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి.
*
రామానుజాచార్యులు జగద్ గురువులు అంటే, అది సత్యం.
రామానుజాచార్యులు తప్ప ఇంకెవరూ జగద్గురువులు కాదు అనడం అనన్వయాలంకారం లా ప్రయోగించిన అతిశయోక్తి అలంకారం అనాలేమో !
నాకయితే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి.




ఇలాంటి అలంకారాలతోనే ఎడారి మతాలవారు మావోడు తప్ప ఇంకెవరూ లేరు అని రచ్చ లేపుతున్నారు !
*
జియర్ స్వామి మాటల్లో ఎక్కడా ప్రత్యక్షంగా శంకరాచార్యులు జగద్గురువులు కారు అనలేదు.
ఆయన ఉద్దేశం రామానుజుల వారి సమకాలిన గురువులతో పోల్చా, ప్రస్తుత కాలం లో గురువులను గూర్చా లేక నిజం గానే అందరితో పోల్చారా అన్నది స్పష్టంగా చెప్పలేము, కాబట్టి బంగారయ్య శర్మగారు, ఇతరులు కాస్త నెమ్మదించి, నేరుగా జియర్ గారినే సంప్రదించి మాట్లాడవలసింది.
ఆయనే తన ఉద్దేశం ఏంటో వివరించేవారేమో. తప్పుగా అనుంటే సవరించేవారేమో.
ఇలాంటి సమస్యలు కోర్టులు టివీ చానళ్ళు మధ్యవర్తిత్వం చెయ్యాల్సిన విషయాలు కాదు.
ఆది శంకరుల్లా శాస్త్రం తెలిసిన పెద్దలు వాదోపవాదాలతో నిర్ణయించాల్సినవి.
టీవీ చానల్ లో చాలెంజుల వల్ల టీవీ వాళ్ళకి, పాషాండ మతాల వారికీ తప్ప ఎవ్వరికి ఉపయోగంలేదు.
*
నీవు తప్ప దిక్కే లేదు అని గజేంద్రుడంటే, విష్ణువెళ్ళి కాపాడాడు. ఇంకెవరూ లేరంటావా అని , మధ్యలో శివుడికి కోపమొచ్చి శూలమేసి ఏనుగుని ఏమీ కొట్టెయ్యలేదు.
ఎందుకంటే శివవిష్ణువు లిద్దరూ ఒక్కటే !
ఎవరి దృష్ట్యానుసారం వారికి దర్శనం కలుగుతుంది !
మా అమ్మ పడినంత కష్టం ఎవరూ పడరు, మా అమ్మ త్యాగమూర్తి, ఎంతో కష్టపడి మా అందరిని పెంచింది అంటారు. నిజానికి అలా అన్న వాడికి తన తల్లి ప్రేమ మాత్రమే అనుభవం. ఇతరుల తల్లుల ప్రేమ ఎంతటిదో వాడికి తెలియదు. కేవలం తన తల్లిని పొగిడే ప్రయత్నం లో అలా అంటాడు. ఇదీ అంతే !
*
అయితే మధ్యలో మనుషులే మనోభావాలు దెబ్బతినేసి గొడవలుపడతారు.
కడుపు చించుకుంటే కాలిమీద పడుతుంది.
గోతి కాడ నక్కల్లా, హిందువులు ఎప్పుడు కులం గురించి గొడవపడతారా,
ఎప్పుడు దేవుళ్ళ గురించి గొడవపడతారా అని వేచిచూసే వారున్న ఈ రోజుల్లో, వేదికలెక్కి విమర్శించుకోవడం హైందవానికి మంచిది కాదు.
*
ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలు చెప్పేది
ఒక పరమ సత్యమే,
చేర్చేది ఒక తీరమే !












🙏




No comments:

Post a Comment