Monday, March 21, 2022

కలియుగ వైకుంఠంలో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు !

తిరుపతి బాలాజి దర్శనం

కలియుగ వైకుంఠంలో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు !


* గోవిందుడు భక్త సులభుడా, వీ.అయి.పీ ప్రియుడా?
* శ్రీ వారి హుండీలో డబ్బులు ఎవరి బొక్కసంలో చేరుతున్నాయి?
* అంతంత జీతాలిచ్చి ఏర్పాటు చేసుకున్న ఐ.ఏ.ఎస్ , ఐ.పీ.ఎస్ వారు ఏమి చేస్తున్నారు?
* భక్తుల విరాళాల లెక్క పూచిక పుల్లతో సహా వెబ్ సైట్లో పెట్టే దమ్ముందా?
* వడ్డీ కాసులవాడి కాసులు ఖర్చు చేస్తూ ఇష్టాను సారం కొత్త నియమాలు చెయ్యడం రేట్లు పెంచడం కాకుండా, నెలలో ఎంత మంది తిరుపతి అధికారులు (సుబ్బారెడ్డి తో సహా) సర్వ దర్శనం క్యూలో వెళ్ళి గోవిందుడి దర్శనం చెసుకుంటున్నారు?
అప్పుడే కదా అసలు కష్టాలు తెలిసేది.
* Setup KIOSKs for LADDUS and MOBILES
* Setup mega lifts and Automatic rolling ramps to reduce the walk in darsanam lines
* ప్రభుత్వానికి చేత కాకపోతే గుడి నిర్వహణ మఠాలకు అప్పచెప్పొచ్చుకదా?
.
ఇవన్ని ఎందుకంటున్నాను అంటే,
దేవుడి దర్శనం కోసం ఎంతో కొంత కష్టపడాల్సిందే, తప్పులేదు, కానీ మరీ భక్తులు నొచ్చుకొనేంత, మళ్ళీ రావాలంటే భయపడేలా ఉందంటే మాత్రం నిర్వహణా లోపమే.గోవిందుడి దగ్గెర జీతం తిసుకుని మరీ ఆయనకు ద్రోహం చెసినట్టే !
.
పద్మావతి అమ్మవారి దర్శనం క్యూ లైన్, వీ అయి పీ బ్రేక్(VIP Break darshan) పేరు చెప్పి ఒక గంట పైగా ఆపేసారు.
వీఅయిపీ లు వచ్చినా, సర్వ దర్శనం మరియూ 300 లైన్లు ఆగకుండా ఏమీ చెయ్యలేరా? ఒకరిద్దరి కోసం అన్ని వేల మంది ఎందుకు ఆగాలి? ఎందుకు కష్టపడాలి?
.
ఇక శ్రీ వారి దర్శనం దారుణం !
1. అలిపిరి మొదటి మెట్టు దెగ్గరికి వెళ్ళడానికి ముందు ఉన్న టన్నెల్ దెగ్గర ఎటువంటి ఏర్పాట్లూ లేవు. ఫాన్లు, క్యూ పద్దతి కోసం రాడ్లు ఏమీ లేవు. తోసుకు పోయిన వారికి తోసుకున్నంత.
2. నడక దారిలో నా అరి కాలు కాస్త గాయపడింది. 9 కిలో మీటర్లలో ఒక్క డిస్పెన్సరీలో కూడా బేండ్ ఎయిడు లేదు. పాలాస్త్రి పట్టీ నేరుగా దెబ్బపై వేసుకుని నడవ వలసి వచ్చింది.
3. నడక దారిన వెళ్ళాకా, సెల్ఫోన్లూ , లగేజు 6-7 కౌంటర్లు పెట్టి త్వరగానే తీసుకున్నారు కానీ అక్కడా తోపులాటే, పోలిసు అధికారులు ఫేను కింద కూర్చున్నారంతే.
4. ఇక ఇక్కడ మొదలైంది నరకం, అన్ని గంటలు శ్రమ కోర్చి 9 కిలోమీటరు నడిచి వచ్చిన భక్తులకు ప్రత్యేక లైను లేదు. 5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది.
5. చంటి పిల్లలు, నెలల చంటి గుడ్డులు, ముసలి వారు.. ఎవ్వరికీ ప్రత్యేక దర్శనం లేదు. మా ముందే ఒక సంవత్సరం పిల్లాడు క్యూ లైన్లో ఉన్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత అమానుషమో తెలుస్తోందా?
6. 19 నంబరు కంపార్టు మెంటు నుండి బయట పడి , మళ్ళీ ఒక గంట క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఎక్కడి నుండో ఆది శేషుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు, మేమేమో "పాము పాము" అని భయపడి పరుగులు తీసి చిన్న పాటి తొక్కిసలాటతో సరిపెట్టుకున్నాం.
మీ అధికారులు ఎవరూ ఎలాగో లేరు కాబట్టి సిసీ టివి పనిచేస్తే వీడియో చూడండి , సరదాగా ఉంటుంది.
7. 15-20 ఫేన్లకు ఒక ఫేను పనిచేసింది క్యూ లైన్లో. రాత్రి స్లాట్ వాళ్ళూ మధ్యానం స్లాట్ వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చేసారు, అంటే పట్టించుకునే వారు లేరు. తొక్కిసలాట, పిలల ఏడుపులు పెద్దల గొడవలు.
8. ఇది వరకు పాలు, మజ్జిగలు పొంగలి వంటివి Queueలో పెట్టినట్టు గుర్తు. ఇప్పుడు మంచి నీళ్ళ తో పాటు ఉక్కపోతలు, నిట్టుర్పులు , చెమట్లూ శాపనార్థాలు బోనస్.
9. దర్శనం క్యూలో బయలు దేరినప్పటి నుండి గర్భ గుడి దెగ్గరి దాకా ఎక్కడా క్యూ ని నియంత్రించే వారు లేరు. ఇష్టా రాజ్యం. ఆలయ ప్రాంగణంలో మాత్రం ఒక 30 మంది అధికారులు, పొండి , వెళ్ళండి, నడవండి అంటూ తోపుడు కార్యక్రమం.
కాస్త గోవింద నామ జపం చెయించారు, అదొక్కటి నయం.
10. పీ వీ ఆర్కే ప్రసాదు గారి చలవ వల్ల కట్టిన గోవిందుని ముందు రేంపు (wooden ramp) వల్ల, దర్శనం మాత్రం అద్భుతంగా జరిగి అంతవరకు వచ్చిన కోపం చల్లరింది.
ఇప్పటీ అధికారులు ఏమి చేస్తున్నారో అని మాత్రం కోపం వచ్చింది.
11. లడ్డూలు అయ్యిపోయాయ్ పక్క లైన్లోకి పొమ్మనడం వల్ల ప్రసాదం కవుంటర్లలో 3 లైన్లలో గంటన్నర నుంచుంటే కాని టోకన్ లడ్డూలు దొరకలేదు. లడ్డూ కియోస్కు (laddu kiosk) పెట్టొచ్చుగా?
12. ఫోన్లు తీసుకునేందుకు 6-7 కవుంటర్లు, తిరిగివ్వడానికి 1 కవుంటర్.
దాని వల్ల విపరీతమైన తొక్కిసలాట్, తిట్లు , గొడవలు. అడిగితే పాట పాడుకున్న వాళ్ళ ఇష్టానుసారం జరుగుతంది అని సమాధానం.
13. ఫోన్లు తిరిగివ్వడానికి కియోస్కు (kiosk) పెట్టొచ్చుగా?
14. దర్శనం క్యూలో నడక, లడ్డుల కోసం నడక, ఫోన్లకోసం నడక తగ్గించ గలిగితే మంచిది.
MEGA lifts, rolling ramp walks పెట్టండి ఎంత ఖర్చు అయినా. గోవిందుడి భక్తుల డబ్బులు వారికే ఖర్చు చెయ్యండి. ప్రభుత్వ జల్సాలకు, అన్యాక్రాంతం చెయ్యడానికి వాడకండి.
నా ముందు ఒక హిందీ అతను, చదువు కోని వాడిని సెల్ఫోను చిట్టీ పై సంతకం పెట్టమని తెలుగులో చెప్తే అతనికి అర్థం కాలేదు. అక్కడి వాళ్ళు అతనిని "మాలోకం సంతకం పెట్టరా" అనడంతో నాకు కోపం వచ్చి, మీరు భక్తులతో ఇలానా మాట్లాడేది అని అన్నా. నీ పని నువ్వు చూసుకో అని వాడి అనడంతో వాళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది. ఇదా టిటీడి ఉద్యొగుల ప్రవర్తన?
.
కొండపై చిత్తశుద్ధి, భాద్యత, గోవిందునిపై భక్తీ గల సమర్థులైన అధికారులను నియమించడం కష్టమా?

No comments:

Post a Comment