Sunday, January 14, 2024

రామునికి ఇప్పుడు మనం ఎంత ఘనంగా స్వాగతం చెప్పాలి?

 14 ఏళ్ళ వనవాసం చేసిన రాముని రాకను దీపావళి గా చేసుకున్నారు అయోధ్యవాసులు.

రత్నాలు, తెల్లటి వస్త్రాలు, పేలాలు, చతురంగ బలాలు, నూరు కుంభాలు, బంగారు కొమ్ములున్న ఎద్దులు సిద్ధం చేసి, ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చేసి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడిగి, ధూపం వేసి, ప్రతి ఇంటి మీద హనుమ / రామ పతాకాలు ఎగురవేసి, నాటక, గాన ఇత్యాదులతో పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అని రామాయణం చెప్తోంది.
.
మరి 500 వందల ఏళ్ళు ఒక చిన్న పూరిపాకలో వన వాసం చేసి
22 జనవరిన గుడిలో ప్రతిష్టింపబడుతున్న రామునికి
ఇప్పుడు మనం ఎంత ఘనంగా స్వాగతం చెప్పాలి?
.
శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందన, సేవ, సఖ్య... భక్తి మార్గాల్లో,
.
వేద వేదాంగ ఇతిహాస ఆగమ, కావ్య, అలంకార, నాటక, గాన, కవిత్వ, అవధాన, అశ్వ, గజ, పాకకర్మ, దోహళ, గంధవాద, పాశుపాల, చిత్ర, లోహా, పాషాణ, మృత్, దారు, అంబర, ఇంద్రజాల మహేంద్రజాల ఇత్యాది కళలతో..
.
ఆవాహన, ఆసన, పాద్య, ఆర్ఘ్య, ఆచమనీయ, స్నాన, వస్త్ర, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూల, నమస్కార ,ప్రదక్షిణ షోడశోపచారాలతో..
.
ఆ రోజు ఈ భూమిపై ఉన్న అందరికీ గుర్తుండి పోయేలా
లోకం మొత్తం భారతదేశం నుండి ప్రవహించే భక్తి పారవశ్యంలో
మునిగి తేలేలా.. జరుపుకోవాలి కదా?



.
మీరేమి చెద్దామనుకుంటున్నారో ఆలోచించుకున్నారా?

No comments:

Post a Comment