Friday, January 19, 2024

రాముడు ఎప్పుడు వస్తే అప్పుడే శుభ ముహూర్తం !

 ఒక ఒడుగు ముహూర్తం నిర్ణయించాలి అంటే వటువు, తల్లి, తండ్రి జాతకాలు, వటువు వయస్సు, ఆయనం, తారాబలం, చంద్రబలం, లగ్నం , ప్రత్యక్ తార లాంటి ఎన్నో పరిగణలోకి తీసుకుని చాలా ముహూర్తాలు సరిచూసుకుంటే కాని పెట్టలేరు. పెళ్ళి ముహూర్తమయినా అంతే.

.
తీరా ముహూర్తం పెట్టాకా,
వేదానికి వేదానికి
శాఖకీ శాఖకీ
కుటుంబానికీ కుటుంబానికి
ఆచార వ్యవహారాల్లో ఎన్నో తేడాలు ఉంటాయి !
అవన్నీ సరి చూసుని / సరి చేసుకుని నిర్వహించుకోవాలి కాబట్టే మన పెళ్ళి / ఒడుగు తంతులు అంత పెద్ద విశిష్ఠ కార్యక్రమాలు అయ్యాయి.
.
మరి అలాంటిది,
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో,
కాష్మీరు నుండీ కన్యాకుమారి దాకా ఎన్ని కోట్ల మంది రామ భక్తులు ఉంటారు?
వారందరూ ఎన్ని ప్రాంతాలలో,
ఎన్ని రకాల సాంప్రదాయాలలో ఉంటారు ?
ఎంత మంది ఏ ఉద్దేశంతో ఏం మట్లాడుతూ ఉంటారు?
అందులో పండితులూ పీఠాధిపతులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా
జరపాల్సిన వాళ్ళు కాబట్టి వారిని పక్కన పెడితే,
* రెండు పంచాంగాల్లో ఎందుకు తేడా ఉంది చెప్పలేని వాళ్ళు
* పోనీ తెలుగు పంచాంగం ఆంగ్ల కేలండర్తో ఎలా కలుస్తుందో కూడా తెలియని వాళ్ళు
* అది కూడా వద్దు అసల ఈ రొజు తిథి వారం నక్షత్రం ఏంటో కూడా తెలియని
కొంతమంది సోషల్ మీడీయా వారియర్లు
అటు ముహూర్తం మంచిదే అని పీఠాదిపతులను తిడుతూనో,
మంచిది కాదు అని బీజేపి మోడీ ని తిడుతూనో పోస్టులు పెడుతుంటే
సివిల్ ఇంజినీరు సర్జరీ ఎలా చెయ్యాలో చెప్పినట్టు
హాస్యాస్పదం గా ఉంది.
ఆ ముహూర్తం పండితులూ పీఠాధిపతుల పని,
వారు మాట్లాడుకునో పోట్లాడుకునో ఒక నిర్ణయానికి వస్తారు,
రాముని రాకకు వేచి చూడడమే మన పని !
.

అయినా రాముడు ఎప్పుడు వస్తే అప్పుడే శుభ ముహూర్తం,
ఆయన్ని ఎప్పుడు అందరూ మనసుల్లో నిలుపుతారొ అప్పుడే లోక కల్యాణం !
@followers

No comments:

Post a Comment